![]() |
![]() |
.webp)
నిన్నటి ప్రేమికుల రోజుని చిన్న సెలెబ్రిటీల నుండి పెద్ద ఆర్టిస్టుల వరకు అందరు గ్రాంఢ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. వారిలో ముఖ్యంగా ఇన్ స్ట్రాగ్రామ్ లో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండేవాళ్ళు ఎక్కువగా జరుపుకున్నారు. అయితే ప్రేమలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించేవారిని మోసం చేయకూడదంటూ గీతు రాయల్ తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది. సరికొత్తగా ప్రేమికులకి సలహాలు సూచనలు ఇస్తూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ఈ పని చేస్తే మనల్ని ప్రేమించిన వారు భాదపడతారని తెలిసినప్పుడు.. వాళ్ళకి తెలియకుండా చేయడం, చేసి దాచడం కరెక్ట్ ఎలా అవుతుంది. తెలియకుండా మోసం చేయడం కరెక్ట్ ఎలా అవుతుంది. లాజిక్ ఉంది కదా అని గీతు రాయల్ ఈ పోస్ట్ లో అంది.
గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది.
బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యాక యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో తన ప్రతీ అప్డేడ్ ని తెలియజేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది.
![]() |
![]() |